చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో పోలైన బ్యాలెట్ పత్రాలు బయటికి వచ్చిన ఘటనలో స్టేజ్- 2 ఆర్వోను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పోలైన బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకువచ్చిన గుర్తుతెలియాని వ్యక్తిపై 233 సెక్షన్ కింద ఎఫ్ఎఆర్ నమోదు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.