SDPT: శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణం ఈ నెల 14న జరగనున్న నేపథ్యంలో మల్లన్న క్షేత్రం కళ్యాణోత్సవానికి ముస్తాబవుతోంది. తోట బావి వద్ద జరిగే ఈ మహోత్సవానికి చలువ పందిళ్లను వేసి, కళ్యాణ వేదికను అన్ని హంగులతో అధికారులు తీర్చిదిద్దారు. ఈ వేడుకకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు.