ప్రకాశం: పొన్నలూరు మండలంలోని ముండ్లమూరివారిపాలెం, చెరుకూరు గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి రాము ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ఏవో మిరపపంట పరిశీలించి తామర పురుగు దాడిని గమనించారు. నివారణకు గట్లు వెంబడి కలుపు మొక్కలను తీసివేయాలని చెప్పారు. పొలం చుట్టూ రక్షణ పంటగా జొన్న, మొక్కజొన్న వేయాలని సూచించారు.