VSP: ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ‘పెన్షన్ అదాలత్ – ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మీ జిల్లాలో అనే ప్రచార కార్యక్రమం’ విశాఖలో విజయవంతంగా గురువారం జరిగింది. పెన్షనర్ల, డిస్బర్సింగ్ ఆఫీసర్ల అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతి ప్రియ అధికారులకు పెన్షనర్లకు దిశానిర్దేశం చేశారు.