TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఓ వ్యక్తికి అదృష్టం కలిసొచ్చింది. యాదాద్రి జిల్లా లక్ష్మక్కపల్లిలో లాటరీతో సర్పంచ్ ఫలితం తేలింది. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 148 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా తీశారు. లాటరీలో BRS మద్దతుదారుడు ఇండ్ల రాజయ్యను విజయం వరించింది.