WG: ఈ నెల 13న తణుకులో జరిగే జాతీయ లోక్ అదాలత్ ద్వారా వీలైనంత ఎక్కువ కేసులు రాజీ చేయాలని నాలుగో అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి కోరారు. గురువారం తణుకు కోర్టు ఆవరణలో పోలీసు అధికారులు, న్యాయవాదులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ వల్ల విలువైన సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చని కక్షిదారులకు ఆమె తెలియజేశారు.