SRPT: సూర్యాపేట మండలంలోని రాజానాయక్ తండ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. సర్పంచ్‌గా లూనావత్ శాంతాబాయి పాండు నాయక్ విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి అయిన లునవత్ రంగమ్మ పెద్ద పాండునాయక్పై హోరాహోరీ పోరులో 40 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఎన్నికల ఫలితం అనంతరం గ్రామస్థులు సంబరాలు చేసుకున్నారు.