MNCL: లక్షెట్టిపేట మండలంలోని దౌడేపల్లి నూతన సర్పంచ్‌గా తీర్థాల వెంకటేష్ విజయం సాధించారు. స్థానిక ఎన్నికలలో భాగంగా గురువారం గ్రామంలో ఎన్నికలు జరిగాయి. అనంతరం కౌంటింగ్ నిర్వహించగా.. తీర్దాల వెంకటేష్ తమ సమీప ప్రత్యర్థిపై 202 ఓట్లతో విజయం సాధించారు. పంచాయతీలో సీపీఐ అభ్యర్థులు వార్డు సభ్యులుగా విజయం సాధించగా, కాంగ్రెస్ బలపరిచిన తీర్థాల వెంకటేష్ గెలిచారు.