ATP: సింగనమల మండలం పెద్ద జలాలపురం గ్రామంలో మహిళల భద్రతకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ పీ. జగదీష్ IPS ఆదేశాల మేరకు శక్తి యాప్ పనితీరు, ఉపయోగాలు, అత్యవసర పరిస్థితుల్లో ఎలా ఉపయోగించాలో శక్తి టీంలు, ఎస్సైలు, సిబ్బంది వివరించారు. మహిళల భద్రత కోసం ఈ యాప్ను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.