VZM: గరివిడి ఎంపీడీవో కార్యాలయంలో MPP మీసాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ZP ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొని వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. గృహ, విద్యుత్, వ్యవసాయ, విద్య, వైద్యాధికారులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. ఇళ్లు లేని వారిని గుర్తించి వాళ్లకి ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.