కోససీమ: విద్యార్థినిల రక్షణపై మహిళా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ సూచించారు. అమలాపురం సత్యసాయి కళ్యాణ మండపంలో గురువారం అమలాపురం డివిజన్ పరిధిలోని మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఒంటరిగా ఉండే మహిళల రక్షణ, స్కూల్స్‌కి వెళ్లే ఆడపిల్లల రక్షణ, సైబర్ నేరాలపై అవగాహన వంటి అంశాల పట్ల శ్రద్ధ చూపాలన్నారు.