ATP: యల్లనూరులో రేపు ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. మండల సమస్యలు, వ్యక్తిగత సమస్యలను ప్రజలు అర్జీ రూపంలో సమర్పించి పరిష్కారం చేసుకోవచ్చని ఎమ్మెల్యే సిబ్బంది తెలిపారు. ఈ ప్రజా దర్బార్‌కు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.