ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు చొరవతో కొండేపి మండలానికి చెందిన ఓ వృద్ధుడి సమస్య పరిష్కార దిశగా పయనించింది. కొండేపి మండలంకు చెందిన హరి నారాయణ (65) ఎస్పీ మీకోసం కార్యక్రమంలో సమస్యను విన్నవించుకున్నాడు. సమీప బంధువులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలపగా.. ఎస్పీ ఆదేశాలతో కొండేపి ఎస్సై ప్రేమ్ కుమార్ వృద్ధుడి ఇంటికెళ్లి మాట్లాడారు.