KRNL: ఆలూరులో అధికారిక పర్యటనలో ఉన్న కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్‌ను టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రాంతంలోని భద్రతా పరిస్థితులపై డీఐజీతో ఆమె చర్చించారు. నియోజకవర్గంలో శాంతి–భద్రతలు కాపాడాలని కోరినట్లు జ్యోతి తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని డీఐజీ అన్నారు.