ATP: విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లోని సృజనాత్మకతకు పదును పెట్టేందుకు దోహదపడతాయని గుంతకల్లు టీడీపీ మండల ఇన్చార్జి గుమ్మనూరు నారాయణస్వామి తెలిపారు. గురువారం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటుచేసిన సైన్స్ ఫేయిర్ను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి మూడు నెలలకు ఒకసారి పాఠశాలల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.