ATP: రామగిరి ఎంపీపీగా కప్పల సాయిలీల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆమెను రామగిరి టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలసి సన్మానించినట్లు ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ప్రజల కోసం సాయిలీల పనిచేసి మంచి పేరు సంపాదించుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆమె అభినందించారు.