KRNL: ఆదోని పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్షక ఫ్యూయల్ పెట్రోల్ బంకును గురువారం DIG ప్రవీణ్ కుమార్, SP విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వినియోగదారులకు కల్తీ లేని, నాణ్యమైన పెట్రోల్ అందించడమే లక్ష్యంగా బంక్ ఏర్పాటు చేశామన్నారు. ఈ పెట్రోల్ బంక్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని పోలీస్ సంక్షేమ నిధికి వినియోగిస్తున్నామని వెల్లడించారు.