సత్యసాయి: జిల్లా కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన పథకం దీర్ఘకాలిక లక్ష్యాలు, ప్రయోజనాలపై జిల్లా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్ధక, డీఆర్డీఏ, అనుబంధ శాఖల అధికారులతో ఆయన సమావేశమయ్యారు.