PLD: చిలకలూరిపేట టౌన్ పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ADE అశోక్ తెలిపారు. డైక్మన్ నగర్, వేలూరు రోడ్డు, సూదావారిపాలెం,తూర్పు మాలపల్లి, శారద హైస్కూల్ రోడ్డు, పురుషోత్తమ పట్నం, సుగాలి కాలనీలకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరెంట్ ఉండదని చెప్పారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.