MDK: అల్లాదుర్గం మండలంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మూసేసరికి గ్రామంలో 82.87 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైనట్లు అధికారులు తెలిపారు.