ATP: భుజానికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్న తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి తిరిగి పట్టణానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పెన్నా నది ఒడ్డున ఉన్న శ్రీ రాజ రాజేశ్వరి బుగ్గరామలింగేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. అలాగే పురాతన ఆలయమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.