CTR: ఐరాల మండలంలోని కొత్తపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి భజన మందిర కుంభాభిషేక కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ గురువారం పాల్గొన్నారు. నిర్వాహకులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.