‘అఖండ 2’ సినిమాకు తెలంగాణ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ ధరలు పెంచుకోవడానికి జారీ చేసిన జీవో రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రీమియర్ షో జీవోను సస్పెండ్ చేసింది. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.