కడప నగర మేయర్ ఎన్నిక నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశపు హాల్లో ప్రారంభమైంది. అయితే ఈ మేయర్ ఎన్నికలకు 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లికార్జున గైర్హాజరయ్యారు. మొత్తం వైసీపీకి 39 మంది కార్పొరేటర్ల బలం ఉండగా ఎన్నికకు 38 మంది హాజరయ్యారు. మల్లికార్జున ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. మేయర్ పదవి కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.