AP: YCP నేత, మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి స్థానిక కోర్టులో లొంగిపోయారు. జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న వీరిని.. 2 వారాల్లో లొంగిపోవాలని NOV 28న సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ సరెండర్ అయ్యారు. స్థానికంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా గురజాల సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయి.