TG: గద్వాల జిల్లా ధరూర్‌లో విషాదం జరిగింది. ఓ ఇంట్లో ఫ్రిజ్ పేలి తల్లి, కొడుకు మృతి చెందగా.. మరో మహిళకు గాయాలయ్యాయి. అయితే ఫ్రిజ్‌ను గోడ నుంచి 15-20 సెం.మీ.ల దూరంలో ఉంచాలని.. ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని, సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, వైరింగ్, ప్లగ్స్ చెక్ చేయడం వంటి జాగ్రత్తలతో ఇలాంటి ఘటనలు నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.