NZB: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని తొలి విడత పోలింగ్ బోధన్ డివిజన్లో ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. మొత్తం 11 మండలాల్లో ఉదయం 9 గంటల వరకు 19.80% ఓట్లు పోలయ్యాయి. బోధన్ మండలంలో 26.26%, చందూర్లో 16.63, కోటగిరిలో 17.76,మోస్రా 15.42, పోతంగల్ 19.76, రెంజల్ 23.99, రుద్రూర్ 10.38,సాలూరు 24.30, వర్నిలో 19.62, ఎడపల్లి 20.48,నవీపేటలో 17% వినియోగించుకున్నారు.