MDK: పంచాయతీ ఎన్నికల్లో మొదటిసారిగా ఓటేయడం సంతోషంగా ఉందని యువ ఓటర్ సారిక పేర్కొన్నారు. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన సారిక వరంగల్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. మొదటి సారిగా ఓటు హక్కు రావడంతో వచ్చి ఓటేయడం సంతోషంగా ఉందన్నారు. ఆలాగే ఆరెపల్లికి చెందిన శ్రీష సైతం హైదరాబాద్ నుంచి వచ్చి ఓటేసినట్లు తెలిపారు.