KMR: బిక్కనూరు సర్పంచ్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా, జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే మందులు అందుబాటులో ఉంచుకుని సేవలు అందిస్తున్నామని ఆరోగ్య విస్తరణ అధికారి వెంకట్ రమణ తెలిపారు. ఆశా కార్యకర్తలు ఈ శిబిరాల్లో సేవలందిస్తున్నారు.