NZB: ఎడపల్లి మండలం జాన్కంపేటలో కొనసాగుతున్న తొలి విడత పోలింగ్‌ను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 71 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామన్నారు. అందులో 31 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని, ప్రతి కేంద్రంలో కౌంటింగ్ ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.