BHPL : ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్ అన్నారు. గురువారం గణపురం మండలంలో తొలి విడత బస్వరాజుపల్లి, పరశురాంపల్లి గ్రామపంచాయతి ఎన్నికల సరళిని ఎస్పీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.