TG: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బీరంగూడ పరువు హత్యకేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి శ్రీజ తల్లి, పిన తండ్రి, తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి విషయం మాట్లాడుదామని చెప్పి.. నిన్న ప్రేమికుడు సాయిని యువతి తల్లిదండ్రులు ఇంటికి పిలిచారు. ఈ క్రమంలో అతనిపై బ్యాటుతో దాడి చేయగా.. అక్కడే మరణించిన విషయం తెలిసిందే.