NLG: పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఎలాంటి తప్పిదాలకు, గొడవలకు అవకాశం లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎవరూ ఎలాంటి ఒత్తిళ్లకు గురికవావద్దన్నారు. ఓటర్లను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.