KRNL: వెల్దుర్తి నుంచి కోడుమూరుకు ప్రయాణించిన చాకలి రామాంజనమ్మ కోడుమూరులో దిగిన తర్వాత తన బంగారు ఆభరణాల బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళన చెందింది. రాత్రి బస్సును తనిఖీ చేసిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసులు బ్యాగును కనుగొని డిపో అధికారులకు అప్పగించారు. వారు పోలీస్ స్టేషన్కు అందజేశారు. బ్యాగులో ఉన్న ఆభరణాలను బాధితురాలికి ఎస్సై నరేశ్ ఇచ్చారు.