NGKL: జిల్లాలో తొలి విడతలో 157 గ్రామాల్లో ఎన్నికలు జరిగేలా షెడ్యూల్ చేయగా, అందులో 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 143 గ్రామాల్లో ఈరోజు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఆటంకాలు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.