GNTR: మంగళగిరి ఎయిమ్స్ వైద్య సేవల్లో కీలక మైలురాయిని అధిగమించింది. ఆసుపత్రి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 30 లక్షల మందికి పైగా రోగులకు ఓపీ (OP) సేవలు అందించినట్లు అధికారులు ప్రకటించారు. కేవలం గత ఆరు నెలల్లోనే 5 లక్షల మంది ఇక్కడ వైద్యం పొందడం విశేషం. ఎయిమ్స్‌పై ప్రజల్లో పెరుగుతున్న నమ్మకానికి ఇదే నిదర్శనమని అధికారులు పేర్కొన్నారు.