KMR: బిక్కనూర్ మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 102 ఏళ్ల వృద్ధురాలు బోగారి శాంతాబాయి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వయసును లెక్కచేయకుండా ఆమె ఓటు వేయడంపై మండల వాసులు అభినందనలు తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ హక్కును తప్పక వినియోగించుకోవాలని ఆమెను చూసి మండల ప్రజలు కోరుతున్నారు.