మంచిర్యాల జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న జెండా వెంకటాపూర్, తిమ్మాపూర్, బాలరావుపేట, ఎల్లారం, హాజీపూర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను డీసీపీ ఏ. భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ బందోబస్త్, మౌలిక వసతుల ఏర్పాట్లను పరిశీంచారు. ఎన్నికలు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.