KKD: పిఠాపురంలో బుధవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి వివరాల మేరకు.. ఆసుపత్రిలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న అల్లం సునీత అనే మహిళపై దుండగులు కత్తులతో దాడి చేశారు. పట్టణ శివారు నరసింగపురం రోడ్డులో ఈ ఘటన జరిగింది. ప్రైవేటు ఆసుపత్రిలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆమెపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో విరుచుకుపడి తీవ్రంగా గాయపరిచారు.