TG: నాగర్కర్నూల్ జిల్లాలోని ఓ గ్రామంలో పోలింగ్ నిలిచిపోయింది. వెల్దండ మండలం కుప్పగండ్లలో పదో వార్డులో అభ్యర్థికి గుర్తు కేటాయించకపోవడంతో పోలింగ్ ఆగింది. ఈ వార్డులో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయగా.. ఎన్నికల సంఘం ఇచ్చిన బ్యాలెట్ పత్రాల్లో ఇద్దరికి మాత్రమే గుర్తులు ఉన్నాయి. మూడో అభ్యర్థికి గుర్తు లేకపోవడంతో.. అధికారులు పోలింగ్ నిలిపివేశారు.