WGL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలోని పోలింగ్ సరళిని గురువారం జనరల్ అబ్సర్వర్ బాల మాయాదేవి పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రక్రియను సమీక్షిస్తూ, ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ సాగాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలని ఆమె సూచించారు.