శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గురువారం చలి తీవ్రత పెరిగింది. జిల్లా కేంద్రంలో 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. గార, కళింగపట్నం, పాతపట్నం, బత్తిలి, కొత్తూరు, సీతంపేట ప్రాంతాలలో పొగ మంచు కురుస్తోంది. జీడీ మామిడి తోటలకు పొగమoచు కారణంగా నష్టం కలుగుతోందని రైతులు ఆందోళన పడుతున్నారు. చలికి శ్రీకాకుళం నగరంలో రోడ్లు నిర్మానుష్యంగా తయారయ్యాయి.