తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో యువతిని లైంగిక వేధించిన కేసులో అసిస్టెంట్ ప్రొఫెసర్లు లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిని మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ నిందితులకు రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు. తర్వాత కోర్టులో హాజరుపరచారు. నిందితులకు న్యాయమూర్తి 15 రోజుల పాటు జుడీషియల్ కస్టడీ విధించారు.