MNCL: జన్నారం మండలంలోని పొనకల్ గ్రామపంచాయతీలో ఉదయం 9 గంటల వరకు 15% మాత్రమే పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. తీవ్ర చలి దృష్ట్యా ప్రజలు బయటకు రాకపోవడంతో పోలింగ్ మందకొడిగా కొనసాగుతుంది. 6,825 ఓటర్లు ఉండగా 9 గంటల వరకు 923 మంది మాత్రమే తమ ఓట్లను వేశారు.