WGL: చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ గ్రామ సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. దీంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన బరిగెల కట్టమ్మ (70) అనే వృద్ధురాలు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా ఆమె సర్పంచ్ పదవికి పోటీ చేస్తోంది. గ్రామస్థులు ఆదరించి గెలిపిస్తే గ్రామానికి సేవలు అందిస్తానని బామ్మ కట్టమ్మ పేర్కొంది.