VSP: ఫ్రీ బస్ పథకం వల్ల విశాఖలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. కాలేజీలు, ఆఫీసు టైముల్లో రద్దీ తీవ్రంగా ఉంది. మొత్తం 736 RTC బస్సుల్లో 575 బస్సులు ఫ్రీ బస్ పథకంలో నడుస్తున్నాయి. ముందుగా 60% పురుషులు, 40% మహిళలు ప్రయాణించగా ఇప్పుడు 75% మహిళలే వస్తున్నారు. మరో 170 బస్సులు పెరిగితే రద్దీ తగ్గుతుందని ఆర్ఎం బి. అప్పలనాయుడు చెప్పారు.