RR: షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలోని చేగుర్ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారు. గ్రామంలో ఎక్కడా ఉద్రిక్తతలు లేకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.