నెల్లూరులో ఈనెల 15వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కాకాణి ప్రకటించారు. సర్వేపల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తున్నందుకు నిరసనగా తమ పార్టీ కోటి సంతకాల సేకరణ చేసిందన్నారు. అన్ని చోట్లా సేకరించిన సంతకాలను 15న జిల్లా కార్యాలయానికి చేరుస్తామన్నారు.