KDP: తుమ్మలపల్లి యురేనియం గ్రామాల సమస్యలపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి బుధవారం సమీక్షించారు. కేకే కొట్టాల భూసేకరణకు ల్యాండ్ కమిటీ వేసి నోటిఫికేషన్ ఇస్తామని, ఇందుకు 6 నెలలు పడుతుందని తెలిపారు. పెండింగ్ ఉద్యోగాలు, పరిహారం వెంటనే క్లియర్ చేయాలని UCIL అధికారులను ఆదేశించారు. బాధితులకు సీఎస్ఆర్ ద్వారా వైద్య, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.