NLR: కోవూరు నియోజకవర్గంలో గ్రామీణ రహదారులకు నూతన రూపం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల మధ్య కనెక్టివిటీ మెరుగుపరచేందుకు పంచాయతీరాజ్ రోడ్ల సంరక్షణకు కేంద్ర స్పెషల్ అసిస్టెన్స్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం కింద నిధులు మంజూరయ్యాయి. మొత్తం 17.55 కిలోమీటర్ల పనులకు రూ.10.24 కోట్లు కేటాయించగా, ఈ పనుల కోసం త్వరలో టెండర్లు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు.